రాజకీయాలకు అతీతంగా మహిళా డైరీ అభివృద్ధి..!!

కాకతీయ, గీసుగొండ: రాజకీయాలకు అతీతంగా మహిళా డైరీని అభివృద్ధి చేసుకుందామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.మండలం కేంద్రంలోని పి.ఎస్.ఆర్.గార్డెన్స్‌లో గీసుగొండ, సంగెం మండలాల ఇందిరా మహిళా ప్రాథమిక సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాల ఈసి సభ్యుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్ది, వారిని కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు....