అభివృద్ధి పనుల్లో ఇంజనీర్ల కృషి ఎనలేనిది: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జడ్పీ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఇంజనీరింగ్ డే కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంజనీర్ల కృషి ఎనలేనిదన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితాన్ని, ఆశయాలను, చేసిన సేవలను, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. విశ్వేశ్వరయ్య సేవలను ఇంజనీరింగ్ అధికారులు ఆదర్శంగా తీసుకొని జిల్లా అభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మోక్షగుండం జయంతి సందర్భంగా...