తండాలు, గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం..!!

కాకతీయ, రాయపర్తి : మండలంలోని సూర్య తండ, ఏకే తండా గిరిజనులకు ప్రయాణం సులభతరం చేసేందుకు గాను నూతన బస్సు సేవలను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సోమవార టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డితో కలిసి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. సూర్య తండా నుండి కొత్తూరు వరకు గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే, ఝాన్సీ రెడ్డి నూతన బస్సులో ప్రయాణించారు. మండల కేంద్రంలో త్వరలో సేవాలాల్ భవనానికి శంకుస్థాపన చేస్తామని ఆమె తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో...