ఆదివాసీల ఆచారాల ప్రకారమే పనులు: మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి: ఆదివాసీల ఆచారాలు దెబ్బ తినకుండా మేడారంలోని అమ్మవార్ల గద్దెలను సుందరంగా తీర్చిదిద్దుతామని, యుద్ధ ప్రాతిపదికన గుడి నిర్మాణ ఏర్పాట్లు చేసి భక్తులకు అందుబాటులో తేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. గిరిజనుల ఆచారాలు సాంప్రదాయాలు పూజారుల అభిప్రాయం మేరకే నూతన గుడి నిర్మాణ ఏర్పాట్లు జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు. సోమవారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ దేవాలయం ప్రాంగణంలో గిరిజన పూజారులు, ఆర్కిటిక్, దేవాదాయ అధికారులతో కలెక్టర్ దివాకర్...