69వ ఎస్ జి ఎఫ్ మండల స్థాయి క్రీడలు ప్రారంభం..!!
కాకతీయ, నెల్లికుదురు: క్రీడల్లో రాణించిన వారికి విద్యా ఉద్యోగాలలో మెండుగా అవకాశాలు లభించి బంగారు భవిష్యత్తు ఉంటుందని మండల విద్యాశాఖ అధికారి ఎ.రాందాస్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో మంగళవారం 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మండల స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 14, 17 సంవత్సరాల విభాగాల్లో బాల బాలికలకు వేరువేరుగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రీడల్లో మొత్తం 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 14...