హ‌త్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

కాక‌తీయ‌, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన హత్య కేసులో నిందితుడు మంత్రి ఆనందానికి జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ ప్రధాన న్యాయమూర్తి నీరజ మంగళవారం తీర్పు వెలువరించారని జిల్లా ఏస్పీ మ‌హేష్ బి.గితే తెలిపారు. జిల్లా ఏస్పీ తెలిపిన వివ‌రాలు ఇలా.. జూలపెల్లి మండలం తెలీకుంటకు చెందిన మరిపెల్లి రాజయ్య (64) వేములవాడ శివారులో తోటకాపరిగా పనిచేస్తూ, సహచరుడు ఆనందంతో తరచూ గొడవలు పడేవాడు. 2024 ఏప్రిల్ 29న ఆనందం ఇనుపపారాతో దాడి చేసి రాజయ్యను హతమార్చాడు. మృతుడి కుమారుడు...