అధిక వర్షాలకు పంటలు దెబ్బతినకుండా జాగ్రత్తలు వహించాలి..!!

కాకతీయ, గీసుగొండ: ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పంటలు దెబ్బతినకుండా జాగ్రత్తలు వహించాలని మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ అన్నారు. గొర్రె గుంట రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి పి.హరిప్రసాద్ బాబు ఆధ్వర్యంలో, జాతీయ ఆహార భద్రతా మిషన్ జిల్లా కన్సల్టెంట్ పి.సారంగం రైతులకు అవగాహన కల్పించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరి, ప్రత్తి, కంది పంటల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువుల వినియోగం, కలుపు నియంత్రణ, పురుగు మందుల వాడకం గురించి సూచనలు చేశారు. సాధారణ ఎరువులకు బదులుగా...