ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా దివ్య‌ దృష్టి వీడియో ఆల్బ‌మ్ ఆవిష్క‌రణ..!!

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థులు పాడిన దివ్యదృష్టి వీడియో ఆల్బమ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ చిన్నారులు సంస్కృత స్తోత్రాలను రాగయుక్తంగా, స్పష్టంగా ఆలపించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. భాష సరిగ్గా పలకలేని ఈ కాలంలో ఇంత శ్రద్ధ, కృషితో పాడటం ఆనందాన్నిచ్చిందని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి అని పిల్లలకు ఆశీస్సులు అందించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చిన్నారులను ప్రోత్సహించడం ఆదర్శనీయమని పేర్కొన్నారు....