జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సన్నద్ధం.. ఎన్నికల అధికారి ఆర్.వి.కర్ణన్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా నోడల్ అధికారులు సర్వ సన్నద్దంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ ఆదేశించారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణ పై జిల్లా ఎన్నికల అధికారి నోడల్ అధికారులతో ప్రాథమిక సన్నాహక సమావేశం నిర్వహించారు. మ్యాన్ పవర్, ఈవిఎం, వివి ప్యాట్ రవాణా, శిక్షణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రవర్తన నియమావళి, శాంతి భద్రతలు, వల్నరబులిటీ మ్యాపింగ్, జిల్లా సెక్యూరిటీ...