క్యూలో నిలిచిన అన్నదాత ..యూరియా కోసం రాత్రింబవళ్లు తిప్పలు.

కాకతీయ, నల్లబెల్లి: రైతులే దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు. కానీ, వ్యవసాయం కోసం అత్యవసరమైన యూరియా కోసం రాత్రింబవళ్లు క్యూలో నిలబడి తిప్పలు పడాల్సి వస్తున్న దుస్థితి మండలంలోని మేడపెల్లి, రాంపూర్ గ్రామాల్లో కనిపించింది. సోమవారం రాత్రి 11 గంటల నుంచే టోకెన్ల కోసం రైతులు రైతు వేదిక వద్ద క్యూ లైన్‌లో నిలబడ్డారు. మంగళవారం ఉదయం టోకెన్ల పంపిణీ ప్రారంభమైన వేళ రైతులు ఒకేసారిగా ఎగబడడంతో కొంత తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ గందరగోళంలో ఒక రైతు గాయపడ్డారు. ఎరువుల కొరతతో రైతులు...