కేంద్రం సంచలన నిర్ణయం.. ఇండియా నుంచి 16వేల మంది విదేశీయులు బహిష్కరణ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో చట్టవిరుద్ధంగా ఉన్న దాదాపు 16 వేల విదేశీయులను భారత్‌ నుంచి బహిష్కరించేందుకు హోం మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఇతర ఏజెన్సీలు కలిసి చేపట్టిన తనిఖీల్లో ఈ విదేశీయులను గుర్తించారు. వీరిలో కొంతమంది మాదకద్రవ్యాల రవాణా, నేరచర్యలు, నకిలీ పత్రాలతో దేశంలోకి ప్రవేశించడం వంటి చర్యల్లో పాల్గొన్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వీరిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచి, దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం...