మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌కు అస్వస్థత..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు మధు యాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం సెక్రటేరియట్‌లో చోటుచేసుకుంది. మధు యాష్కీ మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్‌లో చర్చల నిమిత్తం ఉన్న సమయంలో అకస్మాత్తుగా తల తిరగడం, అస్వస్థతకు గురవడంతో కుర్చీ నుండి కింద పడిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన మంత్రి శ్రీధర్ బాబు తక్షణమే సిబ్బందిని అప్రమత్తం చేసి, వైద్యులను సంప్రదించారు. వెంటనే అక్కడే ప్రాథమిక చికిత్స అందించగా, తరువాత ఆయనను అత్యవసరంగా సమీపంలోని...