డోలిలో మోసుకెళ్తుండగా నడిరోడ్డుపైనే ప్రసవం… భద్రాద్రిలో గర్భిణీ పోరాటం..!!

కాకతీయ, భద్రాద్రి: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఓ గర్బిణీ అనుభవం గ్రామీణ ఆరోగ్య సదుపాయాల పరిస్థితిని మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది. చర్ల మండలం బట్టిగూడెం గ్రామానికి చెందిన రవ్వ భీమేకి అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, గ్రామం నుంచి రహదారి లేకపోవడం వారి ముందున్న అతిపెద్ద అడ్డంకిగా మారింది. అంబులెన్స్ బుదరలోకి చేరలేకపోవడంతో, కుటుంబసభ్యులు భీమేకి డోలిలో కట్టుకుని మోసుకెళ్లాల్సి వచ్చింది. సుమారు ఆరు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లేలోపే నొప్పులు పెరిగి, భీమే నడిరోడ్డుపైనే బిడ్డకు...