అల్లరి చేస్తోందని బాలిక తలపై కొట్టిన టీచర్.. చిట్లిపోయిన విద్యార్థి పుర్రె ఎముక

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తరగతి గదిలో అల్లరి చేస్తోందని విద్యార్థిని టీచర్ కొట్టడంతో ఆమె తలకు బలమైన గాయమై ఆసుపత్రి పాలయ్యింది. ఆసుపత్రిలో స్కానింగ్ చేస్తే ఆమె పుర్రె చిట్లిందని తేలింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పుంగనూరు పట్టణానికి చెందిన హరి, విజేత కూతురు 11 ఏళ్ల సాత్విక నాగశ్రీ స్థానికంగా భాష్యం స్కూల్లో 6వ తరగతి చదువుతోంది. ఈనెల 10న క్లాస్ రూంలో సాత్విక అల్లరి చేస్తోందని ఆమె తలపై హిందీ మాస్టారు...