Bhu Bharati: లంచం కోసం అధికారుల వేధింపులు..ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భూ సంస్కరణలు ఎన్నో చేసినా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భూ భారతి, పాస్‌బుక్ మార్పులు, రికార్డు ఎంట్రీల విషయంలో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లంచం కోసం రెవెన్యూ అధికారులు సృష్టిస్తున్న అడ్డంకులు ఒక కుటుంబాన్ని ప్రాణాలు తీసుకునే స్థితికి నెట్టేశాయి. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన ఆటో డ్రైవర్ శంకర్ తన తాత పేరిట ఉన్న 1.28 ఎకరాల ఇనాం భూమిని తన పేరుపై మార్చుకోవాలని తహసీల్దారు...