విద్యార్థులు చదువుతోపాటు కళలలో కూడా రాణించాలి: జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్

కాక‌తీయ‌, కొత్త‌గూడెం రూర‌ల్ : విద్యార్థులు చదువుతోపాటు కళలలో కూడా రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో రెండు రోజులపాటు జరగనున్న జిల్లా స్థాయి కళా ఉత్సవం పోటీలను మంగళవారం ప్రారంభించారు. ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ చిన్నప్పుడు తనకు కూడా కళల పట్ల ఆసక్తి ఉండేదని చిన్నతనంలో సంగీత ఉపాధ్యాయురాలు అంటే తనకు ఎంతో ఇష్టమని కానీ వాటిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేక పోయానని కానీ నేటి విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుంటేనే భవిష్యత్తు ఆకర్షణీయంగా...