స్వీడన్ నుంచి వరంగల్ దాకా.. అమ్మానాన్నల కోసం కుమార్తె వెతుకులాట..!!
కాకతీయ, వరంగల్ బ్యూరో: పసితనంలోనే తల్లిని కోల్పోయిన కొద్దికాలానికే తండ్రి జాడ లేకుండా పోయాడు. మూడేళ్ల వయసులో అనాథాశ్రమంలో చేరిన చిన్నారిని..స్వీడన్‌కు చెందిన ఓ దంపతుల దత్తతలో పెరిగింది. కాలం గడిచిపోయింది. కానీ మనసులో ఒకే తపన.. నా స్వంత తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆమె స్వీడన్ నుంచి వరంగల్ వరకు తన అన్వేషణ కొనసాగిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లాకు చెందిన బి. రాజ్‌కుమార్ అనే వ్యక్తి కుమార్తె సంధ్యారాణి. పసివయస్సులోనే తల్లి మరణించడంతో.. మూడేళ్ల వయసులోనే...