Aarogyasri: నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకంపై మళ్లీ పెద్ద చర్చ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్థరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ప్రభుత్వం నుంచి పెద్దఎత్తున బకాయిలు రావాల్సి ఉండడంతో, సమస్యల పరిష్కారం కాని పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన 323 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి....