Jobs: మహిళా అభ్యర్థులకు గుడ్ న్యూస్..అంగన్ వాడిల్లో 15,274 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మహిళా అభ్యర్థులకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించబోతోంది ప్రభుత్వం. రాష్ట్రంలో అంగన్ వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత సమస్య పరిష్కారం దిశగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతులు, ఉద్యోగ విరమణల కారణంగా ఏర్పడిన మొత్తం 15,274 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నియామకాల ద్వారా చిన్నారులకు పోషకాహారం, పూర్వ ప్రాథమిక విద్య, ఆరోగ్య సంబంధిత సేవలు మరింత సమర్థవంతంగా అందే అవకాశం ఉంది. ప్రస్తుతం అనేక అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులు లేకపోవడంతో పిల్లలకు సరైన...