యూరియా అందించడంలో కేంద్రం విఫలం: సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న

కాకతీయ, పినపాక : తెలంగాణ రైతులకు యూరియా బస్తాలు అందించడంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న ఆరోపించారు. మంగళవారం ఆయన పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులు, యూరియా బస్తాల కోటా తగ్గించి రైతులను ఇబ్బందికి గురి చేస్తుందన్నారు. పండించిన పంటలను కొనడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నెలల తరబడి నిర్లక్ష్యం చేయగా నేడు ఎరువుల కొరతతో రైతులను ఇబ్బందుల పాలు చేస్తుందని మండిపడ్డారు....