గుట్టలను గుల్ల చేస్తున్న మాఫియా.. పట్టించుకోని అధికార యంత్రాంగం
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : చారిత్రక గుట్టలు.. ఎత్తయిన ప్రాంతాలు అక్రమార్కుల దందాతో కనుమెరుగుతున్నాయి.. కొందరు సిండికేట్ గా ఏర్పడి ప్రకృతి సంపదను దర్జాగా కొల్లగొడుతున్న పరిస్థితి నెలకొంది.. ఇసుక దందాను దొంగల ముఠా కొనసాగించడమే కాకుండా కొత్తగా గుట్టలపై కన్నేసి అందులో ఉన్న సంపదను దోచుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ పక్కన ఉన్న బోడ గుట్టను మట్టి దొంగలు తోడేస్తున్నారు. ఎక్స్‌కవేటర్ లతో ఇష్టారాజ్యంగా తవ్వుతూ మట్టితో పాటుగా ఇండ్లకు ఉపయోగించే పునాది...