రైతులందరికీ యూరియా అందజేస్తాం: కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
కాకతీయ, మహబూబాబాద్ : జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా జిల్లా అధికారులను సమన్వయపరిచి రైతులందరికీ యూరియా సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ మరిపెడ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయలను పరిశీలించారు. మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యూరియా పంపిణీ కేంద్రాన్ని సందర్శించి సరఫరా చేస్తున్న ప్రక్రియను పారదర్శకంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ రైతుకు అందే...