యువత దేశానికి మార్గదర్శకంగా మెదలాలి: పెద్దపల్లి ఎమ్యెల్యే చింతకుంట విజయరమణ రావు
కాకతీయ, పెద్దపల్లి : మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పిస్తూ పెద్దపల్లి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ఎంబీ గార్డెన్స్ వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఈ అవగాహన ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు మాట్లాడారు. మత్తుకు ఎవరూ బానిస కాకూడదని, యువత దేశానికి మార్గదర్శకంగా ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ నినాదంతో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు...