ఆయుధాలు వదిలేస్తం.. మావోయిస్టుల సంచలన నిర్ణయం..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: మావోయిస్ట పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంగా సాగుతున్న సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరామం ఇస్తూ, చర్చలకు సిద్ధమని పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరిట ఒక లేఖ విడుదలైంది. దేశం, ప్రపంచం మారుతున్న పరిణామాల దృష్ట్యా ఇకపై ఆయుధాలను విడిచి ప్రధాన స్రవంతిలో కలిసిపోవాలన్న ఆలోచనకు పార్టీ అంగీకరించినట్టు లేఖలో స్పష్టం చేశారు. 30 రోజులపాటు కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటించాలని కోరుతూ, ఆ గడువులో సహచరులతో చర్చలు జరుపుతామని తెలిపారు....