రూ.5వేల కోట్లతో హనుమకొండ, వరంగల్ అభివృద్ధి పనులు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని, గత పదేళ్లలో కేవలం హామీలకే పరిమితమైన అభివృద్ధిని, ఇప్పుడు క్షేత్రస్థాయిలో పనుల రూపంలో చూపిస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండలో బుధవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అదాలత్ కూడలిలోని అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర మంత్రి పొంగులేటి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య,...