ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు హాజరైన ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్

కాకతీయ, మహబూబాబాద్ టౌన్: సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని, బుధవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఆవిష్కరించి జిల్లా సమగ్ర అభివృద్ధిపై ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లాలో యూరియా పంపిణీ (సరఫరా) లో నిమగ్నమై రైతులకు క్షేత్రస్థాయిలో వేగంగా పారదర్శకంగా సేవలు అందిస్తున్న జిల్లా కలెక్టర్...