పరకాల అమరుల చరిత్ర భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది: రేవూరి ప్రకాశ్ రెడ్డి

కాకతీయ, పరకాల: బుధవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, అమరధామం, అమరవీరుల స్మారక భవనం యందు నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగఫలం రాచరికపు పాలన నుంచి విముక్తి పొంది భారత యూనియన్‌లో విలీనమైన...