కలెక్టర్ ను పార్టీ కార్యకర్త అని ఆరోపించడం సరైంది కాదు: మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రైతులకు నష్టపరిహారం చెల్లించినందుకు కలెక్టర్‌పై విమర్శలు చేయడం తగదని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 900 మంది రైతులకు నష్టపరిహారం అందించినందుకు జిల్లా కలెక్టర్ దివాకర్ ను పార్టీ కార్యకర్త అని ఆరోపించడం సరైంది కాదు అని, రైతులకు నకిలీ విత్తనాలు ఇచ్చిన దళారుల వల్ల రైతుల చావు జరిగింది అని, ఆ రైతులకు నష్టపరిహారం అందించడం...