భారతదేశాన్ని సూపర్ పవర్ గా మార్చడమే మోదీ లక్ష్యం.!!
కాకతీయ, వరంగల్ : భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారని బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పేర్కొన్నారు. బుధవారం ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందరమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. ఇందులో భాగంగానే అమెరికా ఎంత ఒత్తిడి...