కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..!!

కాక‌తీయ‌, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో బుధవారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కమిషనరేట్ కేంద్రంలోని క్వార్టర్స్ గార్డ్ వద్ద కరీంనగర్‌ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సిపిఓ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా అడిషనల్ డీసీపీ వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పోలీస్ సిబ్బంది ప్రధాన కర్తవ్యం అని తెలిపారు. సమాజంలో...