సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి..!!

కాకతీయ, మహబూబాబాద్ టౌన్ : ఈనెల 22 నుండి ప్రారంభమయ్యే ఓపెన్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కొరకు జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ అధ్యక్షతన బుధవారంజిల్లా కలెక్టరేట్ లో లైన్ డిపార్ట్మెంట్లతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడమైనది అందులో మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల అందులో పదో తరగతి కొరకు 96 మంది విద్యార్థులు...