తెలంగాణ విమోచన దినోత్సవం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు ముఖ్య అతిధిగా హాజరై, అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులు అర్పించారు. ఇదే సందర్భంలో, కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని కూడా రాజ్ నాథ్ సింగ్ గారు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి గారు, గజేంద్ర సింగ్...