విద్యావిధానంలో సమూల మార్పులతోనే పేదరిక నిర్మూలన : సీఎం రేవంత్ రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యావిధానంలో సమూల మార్పులు ప్రక్షాళన అవసరం ఉందని మా ప్రభుత్వం నిర్ణయించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త విద్యా విధానం పేదరిక నిర్మూలనకు దోహదం చేయడంతో పాటు, పిల్లల భవిష్యత్తును ప్రకాశవంతం చేసేలా ఉండాలని ఆయన పేర్కొన్నారు. గతంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు తెలంగాణ విద్యకు బలమైన ఆధారం అయి నిలిచినా, ఓపెన్ మార్కెట్ కారణంగా మన విద్యా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి సరిపోలడం లేదని వ్యాఖ్యానించారు. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 1.10 లక్షల మంది...