Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎమ్మెల్సీ నవీన్ ( తీన్మార్ మల్లన్న) తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ పార్టీ ఆవిర్భావాన్ని అధికారికంగా వెల్లడించారు. తీన్మార్ మల్లన్న ఇప్పటికే తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలపై గళమెత్తుతూ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రజలతో నేరుగా మమేకమవుతూ, పారదర్శక పాలన, నిజమైన ప్రజాస్వామ్యం,...