అమరవీరుల త్యాగాల వల్లే తెలంగాణ సాధ్యమైంది: మంత్రి పొన్నం ప్రభాకర్
కాకతీయ, సిధ్దిపేట: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో బుధవారం నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బైరాన్‌పల్లి అమర వీరుల స్మారకానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 1948 ఆగస్టు 27న ప్రాణాలు అర్పించిన వందలాది అమరులను స్మరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నీళ్ళు,నిధులు, నియామకాలు అనే ప్రజల ఆకాంక్షలతో ప్రారంభమై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రజల ఆశయాలను నెరవేర్చుతుందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు...