కృష్ణా, గోదావరి జలాలు, మూసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వరంలో హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేడుకలకు హాజరయ్యారు. తొలుత గన్ పార్క్ దగ్గర అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాజీ పడబోతున్నా లేదు. నీటి హక్కుల కోసం చేస్తోన్న న్యాయ పోరాటంలో తెలంగాణ రాష్ట్రం ట్రిబ్యునల్ వద్ద తమ వాదనలు బలంగా...