ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ (ఈవీఎంలు)పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎం బ్యాలెట్ పేపర్లు మరింత సులువుగా చదివేందుకు వీలుగా నిబంధలను ఈసీఐ సవరించింది. మొదటిసారిగా ఈవీఎంలపై గుర్తులతోపాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉండనున్నాయి. సీరియల్ నెంబర్లను కూడా ప్రముఖం కనిపించే విధంగా చేయనున్నారు. తొలిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 1. EVM బ్యాలెట్ పేపర్ల స్పష్టత, చదవగలిగేలా మెరుగుపరచడానికి భారత ఎన్నికల సంఘం (ECI) ఎన్నికల నిర్వహణ...