లంబాడీల ఆత్మగౌరవ మహార్యాలీ విజయవంతం చేయాలి..!!

కాకతీయ, బయ్యారం : మండల కేంద్రంలో సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు భూక్యా రవి నాయక్ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న నాయక్ మాట్లాడారు. తెలంగాణ లంబాడీల రిజర్వేషన్ మూలాలను శంకించే విధంగా జరుగుతున్న దుష్ప్రచారాలను అడ్డుకట్ట వేస్తూ, మన రిజర్వేషన్ మనమే పరిరక్షిస్తూ భావితరాలకు అందించేలా ఒక రక్షణ కవచంలా ఏర్పడి ఐక్యత చాటాలని తెలిపారు. లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాల పురిటి గడ్డ మానుకోటలో జరిగే లంబాడీల ఆత్మగౌరవ మహా ర్యాలీ...