ఎందరో త్యాగ ధనుల పోరాటాల ఫలితం తెలంగాణ రాష్ట్రం: మంత్రి కొండా సురేఖ

కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ ఐడి ఓసి మైదానంలో బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోరాట యోధులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు, విద్యార్థులకు  మంత్రి కొండా సురేఖ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందన్నారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన సెప్టెంబర్ 17ను 'తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం’గా నిర్వహించాలని రాష్ట్ర...