వృద్ధురాలు హత్య కేసులో ముగ్గురు అరెస్ట్..!!
కాకతీయ, నెల్లికుదురు: ఇటీవల కలకలం రేపిన స్థానిక మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు వీరగాని రాధమ్మ హత్య కేసును పోలీసులు చేదించినట్లు తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ గణేష్, ఎస్సై చిర్ర రమేష్ బాబులతో కలిసి డి.ఎస్.పి కృష్ణ కిషోర్ సమావేశంలో వివరాలు తెలిపారు. మృతురాలు రాధమ్మ ఇంటి పక్కనే అంతకుమునుపు నిందితులు వీరగాని ఉప్పలయ్య, వీరగాని మహేష్ ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారని, అనంతరం సొంత ఇల్లును నిర్మించుకొని దూరంగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్న తరుణంలో...