ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం.!!
కాకతీయ, గీసుకొండ: శ్రీ మద్విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని పురస్కరించుకొని 16 వ డివిజన్ ధర్మారం రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మారం విశ్వబ్రాహ్మణ సంఘం కన్వీనర్ కొక్కొండ శ్రీకాంత్ ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి సొల్లేటి కృష్ణమాచారి హాజరై మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మల్లంతా కలిసికట్టుగా ఉండాలని ఆకాంక్షించారు. సనాతన ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు విశ్వబ్రాహ్మణ సంఘము వరంగల్ జిల్లా అధ్యక్షులు బండ్లోజు నరసింహ చారి,...