పత్తి సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో: క‌రీంన‌గ‌ర్‌ జిల్లాలో పత్తి పంట సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పత్తి కొనుగోలుపై సంబంధిత అధికారులు, ట్రేడర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 44 వేల 885 ఎకరాల్లో పత్తి సాగైందని, 5 లక్షల 38 వేల 620 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశామని తెలిపారు. జిల్లాలోని కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గోపాలరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ...