సాహిత్య విమర్శకుడు ఆచార్య ఎస్వీ రామారావు కన్నుమూత.!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ రచయిత సాహిత్య విమర్శకులు ఆచార్య ఎస్వీ రామారావు గారి మరణం సాహిత్య రంగానికి తీరని లోటు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎస్వీ రామారావు గారి మృతికి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ జిల్లా శ్రీరంగాపూర్ గ్రామంలో జన్మించిన ఆచార్య ఎస్వీ రామారావు గారు పరిశోధకునిగా, రచయితగా, విమర్శకునిగా, పరిశోధనలకు మార్గదర్శకునిగా అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 19 పీహెచ్ డీ, 15 ఎం.ఫిల్ పరిశోధనలకు మార్గనిర్దేశం చేసిన ఆయన...