వామన్‌రావు దంపతుల హత్యపై సీబీఐ విచారణ ప్రారంభం..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సంచలనం రేపిన హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసులో క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించింది. 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెర్ల సమీపంలో వామన్‌రావు, ఆయన భార్య నాగమణి దారుణ హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. మొదట ముగ్గురిపై మాత్రమే కేసు నమోదు చేసిన పోలీసులు, తర్వాత విచారణలో మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు...