తెలంగాణ మైనారిటీలకు సీఎం రేవంత్ రెడ్డి గొప్ప కానుక..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : మైనారిటీల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. శుక్రవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రెండు కొత్త పథకాలను లాంచనంగా ప్రారంభించారు. ప్రారంభించిన పథకాలు.. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలకు రూ. 50,000 ఆర్థిక సాయం. రేవంతన్నా కా సహారా, మిస్కీన్‌ల కోసం, ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్...