ప్రాణహితపై హరీశ్ విమర్శలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుల ఖర్చులు, ప్రయోజనాలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డ నుండి మల్లన్నసాగర్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.84,000 కోట్లు కాగా, తమ్మిడి హెట్టి నుండి ఎల్లంపల్లి వరకు మాత్రమే రూ.35,000 కోట్లు ఖర్చు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం ఉండగా, ప్రాణహిత-చేవెళ్లతో కేవలం 4.47 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందించాలనుకుంటున్నారు....