తెలంగాణలో పోలీసులకే రక్షణ కరువు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నిర్మల్ జిల్లా కుభీర్ పోలీస్ స్టేషన్‌లో ఘోరం జరిగింది. శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లోకి కత్తి పట్టుకొని దూసుకెళ్లి, విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. సమాచారం ప్రకారం, రాత్రి 10 గంటల సమయంలో నిందితుడు నేరుగా ఎస్ఐ గదికి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో హెడ్ కానిస్టేబుల్ టి. నారాయణ అతన్ని అడ్డుకోవడంతో, నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో ఆయన కడుపు పైభాగంలో పొడిచాడు. ఈ ఘటనను చూసిన హోం గార్డ్...