ఇండోనేషియా, రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: ఇండోనేషియాలోని మధ్య పపువా ప్రావిన్స్లో శుక్రవారం (సెప్టెంబర్ 19, 2025) తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఈ ప్రకంపనల కేంద్రం నబిరే నగరానికి దక్షిణంగా 28 కిలోమీటర్ల దూరంలో, భూమికి లోతుగా ఉందని సమాచారం. తాత్కాలికంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం వంటి వివరాలు లభించకపోయినా, భూకంపం కారణంగా స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రపంచంలోనే అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో ఇండోనేషియా ఒకటి. ఇది ఆసియా, ఆస్ట్రేలియా...