తన నివాసంలో కదంబ చెట్టు నాటిన ప్రధాని మోదీ .. బర్త్‌డే స్పెషల్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్‌-III ఒక ప్రత్యేక బహుమతిని పంపించారు. ఆయన పంపిన గిఫ్ట్‌ మరేదీ కాదు… కదంబ చెట్టు. ఈ బహుమతిని బుధవారం న్యూఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్‌ అధికారికంగా ప్రధానికి అందజేసింది. అనంతరం ప్రధాని మోదీ తన అధికారిక నివాసమైన 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఈ చెట్టును శుక్రవారం ఉదయం స్వయంగా నాటారు. ఆ తర్వాత మొక్కకు నీళ్లు పోసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి....