డ్రగ్స్ నిర్మూలనలో దేశంలోనే ముందంజలో తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
కాకతీయ, ఢిల్లీ : తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, పెట్టుబడులు, యువత నైపుణ్యాలు, క్రీడలు, పర్యావరణం, రవాణా రంగాలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పి ఏ ఎఫ్ ఐ) 12వ వార్షిక సదస్సులో కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర పరిపాలనకు రాజకీయ సంకల్పం అవసరమని, భవిష్యత్ తరాల కోసం అవకాశాలు సృష్టించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలోనే కొత్త రాష్ట్రం అయినా తెలంగాణకు, హైద్రాబాద్‌కు గొప్ప చరిత్ర ఉందని గుర్తుచేశారు. రాష్ట్ర...